“కథానిలయం”కు స్వాగతం

ప్రసిద్ధ కథారచయిత కాళీపట్నం రామారావుగారి ఆలోచన రూపంగా 1997లో శ్రీకాకుళంలో కథానిలయం పుట్టింది. గురజాడ అప్పారావుగారి దిద్దుబాటు కథ వెలువడిన ఫిబ్రవరి 22వ తేదీన కథానిలయం ప్రారంభమయింది. రామారావుగారి సాహిత్య సంపాదనలో ప్రతి పైసా ఈ కథానిలయానికి అందించారు. అనేక మంది సాహిత్యాభిమానులు, రచయితలూ చేయివేసారు. రామారావుగారి సొంత పుస్తకాలు కథానిలయానికి తొలి పుస్తకాలు అయాయి. మొదటి సభలో పాల్గొన్న గూటాల కృష్ణమూర్తిగారు లండన్ నివాసి. చాలాకాలంగా బ్రిటిష్ లైబ్రరీతో సంబంధం ఉన్నవారు. ఆయన ఆనాటి సభలో ఉపన్యసిస్తూ – ఇలా ఒక ప్రక్రియకు లైబ్రరీ ఏర్పడటం ప్రపంచం మొత్తంమీద ఇదే ప్రప్రథమం – అన్నారు. రామారావుగారి అవిరామ కృషితో వందలాది మంది సాహిత్య సేకరణకర్తలు కథాసంపుటాలూ, సంకలనాలూ, పత్రికల మూలాలు గాని, ఫొటో నకళ్లు గాని సమకూర్చారు.
2014 సెప్టెంబర్ నాటికి రమారమీ 900 పత్రికల వివరాలు, 3000కి పైగా కథాసంపుటాలూ, సంకలనాలూ కథానిలయం సేకరించగలిగింది. వీటితోబాటు దాదాపు 1000 మంది రచయితలు తమ వివరాలను, తమ కథల నకళ్లను (దొరికిన వాటిని) అందించారు. ఇవికాక ఈ కథల కాల నేపథ్యాన్నీ సమాజ నేపథ్యాన్నీ అధ్యయనం చేసేందుకు వీలుగా ఆత్మకథలు, జీవిత కథలు, సామాజిక చరిత్రలు, ఉద్యమ చరిత్రలు కూడా సేకరించబడుతున్నాయి. ఆయా కథలు వెలువడిన వెంబడే వచ్చిన స్పందనలు, ఆ మీదట విమర్శకుల తూనికలు వగైరా సమాచారమంతా పోగుచేయటానికి కృషి జరుగుతోంది. దీనికి తోడుగా రచయితల గొంతులను, ఛాయాచిత్రాలను, జీవిత వివరాలను కూడా సేకరించి భద్రపరచాలని ఆలోచన ఉంది. ఈ పనులు కూడా మొదలయాయి.
ఈ సమాచారానికి వినియోగం ఉండాలి. అందుకోసం-
ఇదంతా క్రోడీకరణ జరిగింది. ఇక్కడ ఏముందో సాహిత్య జీవులకు అందించే ప్రయత్నంలో కథానిలయం వెబ్‌సైట్ ఏర్పడింది.
కథానిలయం వెబ్‌సైట్‌లో పొందుపరచబడ్డ కథలు వివిధ మాధ్యమాలనుండి తీసుకున్నాం. కథలని సేకరించడంలో ఆయా మూలాల ప్రాముఖ్యతని విస్మరించలేము. అయితే కథల పేజీల నాణ్యత కొన్ని సందర్భాల్లో ప్రామాణికంగా లేకపోవడానికి అదికూడా ఒక కారణం.
వివిధ మార్గాల ద్వారా లభ్యమైన ఈ రచనలని లాభాపేక్ష లేకుండా ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నప్పటికీ, ఈ విషయంలో రచయితల అభిప్రాయాలకి మేము గౌరవం ఇస్తాము. ఈ వెబ్‌సైట్‌లో కథలని ఉంచడం పట్ల ఆయా కథారచయితలకి అభ్యంతరాలు ఉన్న పక్షంలో వాటిని మాకు తెలియజేస్తే (kathanilayam@gmail.com), ఆ కథలని తొలగించడం జరుగుతుంది.
ప్రస్తుతం “కథానిలయం”లోని కథలు: 75063
2470449మంది చదివారు.
ఎక్కువమార్లు చదువబడిన కథలు: | |
'-టీ' వాలా కథ | 6014 |
ఋణానందలహరి | 4107 |
యజ్ఞం | 2914 |
ఊరి చివర యిల్లు | 2591 |
'ఎటర్నల్ ట్రయాంగిల్'పై ఎవరెలా రాస్తారో! | 2410 |
'కానీ' పాతదే కానీ | 2326 |
నల్లమేక | 2063 |
'సబ్ వే'లో సత్యభామ | 1912 |
ఆ చేతి చేత | 1840 |
ఇద్దరమ్మాయిలూ-ముగ్గురబ్బాయిలూ | 1697 |