kathanilayam
 

కథానిలయం

alternate text

మనకు గ్రంథాలయ ఉద్యమాలు వచ్చాయి. అవి అనేక ఊళ్లలో గ్రంథాలయాలు తెచ్చాయి. ప్రభుత్వాలు సైతం పౌరుల గ్రంథపఠనం వారి అక్షరాస్యత, విద్యావ్యాప్తిలలో భాగంగా భావించి గ్రంథాలయాలకు నిధులు కేటాయించాయి. అవి గ్రంథ సేకరణ, భద్రతలకు ప్రయత్నించాయి. స్వచ్ఛంద సంస్థలు నడుం కట్టాయి. దాతలు విరాళాలు అందించారు. ఈ గ్రంథాలయాలు ఆరంభ లక్ష్యాలను చాలావరకు సాధించగలిగాయి. వినోదంకోసం చదివేవారికి ఇతర వినోదసాధనాలు అందుబాటులోకి రావటం, ఆసక్తిగా, ఆబగా చదవగలిగిన వయసులో పిల్లలకు పాఠ్యపుస్తకాలకు వెచ్చించాల్సిన సమయం అపరిమితంగా పెరిగిపోవటం వంటి పరిణామాలతో గ్రంథాలయాల వినియోగం తగ్గింది. ఒకప్పుడు జీవికనిచ్చిన అణా లైబ్రరీలూ, సర్క్యులేషన్ లైబ్రరీలూ అవి ఆధారపడిన పుస్తకాలు ఏ కోవకి చెందినవైనా కనుమరుగవసాగాయి. భద్రపరచటానికి అవసరమైన స్థలం, సంకల్పబలం, సాధనాలు కొరవడటంతో అనేక పత్రికలు పుస్తకాలు కాలగర్భంలో కలిసిపోసాగాయి. కనీసం అంగబలం, అర్థబలం కల పత్రికలు సైతం తమ పత్రికలనైనా భద్రపరచటానికి గట్టిగా పూనుకోలేదు.

ఈ స్థితిలో-

ప్రసిద్ధ కథారచయిత కాళీపట్నం రామారావుగారికి ఒక ఆలోచన కలిగింది. ఒక కథ రాయటానికి ఒక వ్యక్తి కనీసం కొన్ని గంటల నుంచి కొన్ని రోజులు వారాలు నెలలు శ్రమ పడతాడు. ఆ శ్రమ ఫలితానికి ఆయువు ఎన్నాళ్లు? అచ్చైన పత్రికని బట్టి ఒక రోజు, ఒక వారం, ఒక పక్షం, ఒక మాసం. ఆసక్తీ, శక్తీగలవారు పూనుకుని పుస్తకరూపంలో రూపంలో తెస్తే, తెచ్చుకుంటే కొన్నేళ్లు. ఇలా ఈ శ్రమంతా వృధాపోవలసిందేనా? నన్నింతవాడిని చేసిన కథాప్రక్రియలోని శ్రమనైనా కనీసం కొంతకాలమైనా భద్రపరచలేనా? అని ప్రశ్నించుకున్నారు.

అలా పుట్టింది 1997లో శ్రీకాకుళంలో కథానిలయం. గురజాడ అప్పారావుగారి దిద్దుబాటు కథ వెలువడిన ఫిబ్రవరి 22వ తేదీన కథానిలయం ప్రారంభమయింది. రామారావుగారి సాహిత్య సంపాదనలో ప్రతి పైసా ఈ కథానిలయానికి అందించారు. అనేక మంది సాహిత్యాభిమానులు, రచయితలూ చేయివేసారు. రామారావుగారి సొంత పుస్తకాలు కథానిలయానికి తొలి పుస్తకాలు అయాయి. మొదటి సభలో పాల్గొన్న గూటాల కృష్ణమూర్తిగారు లండన్ నివాసి. చాలాకాలంగా బ్రిటిష్ లైబ్రరీతో సంబంధం ఉన్నవారు. ఆయన ఆనాటి సభలో ఉపన్యసిస్తూ – ఇలా ఒక ప్రక్రియకు లైబ్రరీ ఏర్పడటం ప్రపంచం మొత్తంమీద ఇదే ప్రప్రథమం. – అన్నారు. రామారావుగారి అవిరామ కృషితో వందలాది మంది సాహిత్య సేకరణకర్తలు కథాసంపుటాలూ, సంకలనాలూ, పత్రికల మూలాలు గాని, ఫొటో నకళ్లు గాని సమకూర్చారు.

2014 సెప్టెంబర్ నాటికి రమారమీ 900 పత్రికల వివరాలు, 3000కి పైగా కథాసంపుటాలూ, సంకలనాలూ కథానిలయం సేకరించగలిగింది. వీటితోబాటు దాదాపు 1000 మంది రచయితలు తమ వివరాలను, తమ కథల నకళ్లను (దొరికిన వాటిని) అందించారు. ఇవికాక ఈ కథల కాల నేపథ్యాన్నీ సమాజ నేపథ్యాన్నీ అధ్యయనం చేసేందుకు వీలుగా ఆత్మకథలు, జీవిత కథలు, సామాజిక చరిత్రలు, ఉద్యమ చరిత్రలు కూడా సేకరించబడుతున్నాయి. ఆయా కథలు వెలువడిన వెంబడే వచ్చిన స్పందనలు, ఆ మీదట విమర్శకుల తూనికలు వగైరా సమాచారమంతా పోగుచేయటానికి కృషి జరుగుతోంది. దీనికి తోడుగా రచయితల గొంతులను, ఛాయాచిత్రాలను, జీవిత వివరాలను కూడా సేకరించి భద్రపరచాలని ఆలోచన ఉంది. ఈ పనులు కూడా మొదలయాయి.

ఈ సమాచారానికి వినియోగం ఉండాలి. అందుకోసం-

ఇదంతా క్రోడీకరణ జరిగింది. ఇక్కడ ఏముందో సాహిత్య జీవులకు అందించే ప్రయత్నంలో కథానిలయం వెబ్‍సైట్ ఏర్పడింది.

కథానిలయం వెబ్‌సైట్‌లో పొందుపరచబడ్డ కథలు వివిధ మాధ్యమాలనుండి తీసుకున్నాం. కథలని సేకరించడంలో ఆయా మూలాల ప్రాముఖ్యతని విస్మరించలేము. అయితే కథల పేజీల నాణ్యత కొన్ని సందర్భాల్లో ప్రామాణికంగా లేకపోవడానికి అదికూడా ఒక కారణం.

వివిధ మార్గాల ద్వారా లభ్యమైన ఈ రచనలని లాభాపేక్ష లేకుండా ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నప్పటికీ, ఈ విషయంలో రచయితల అభిప్రాయాలకి మేము గౌరవం ఇస్తాము. ఈ వెబ్‌సైట్‌లో కథలని ఉంచడం పట్ల ఆయా కథారచయితలకి అభ్యంతరాలు ఉన్న పక్షంలో వాటిని మాకు తెలియజేస్తే (kathanilayam@gmail.com), ఆ కథలని తొలగించడం జరుగుతుంది.

పోతే-

ఈ కృషిని ఇంతవరకూ ఉపయోగించుకున్నవారెవరు?

విశ్వవిద్యాలయాలలోని పరిశోధక విద్యార్థులు, సాహిత్యాభిమానులు, రచయితలు, విమర్శకులు, ఎందరో కథానిలయం సేవలను వినియోగించుకోడం మొదలెట్టారు. ఈ వెబ్‍సైట్ వారందరికీ మరింత సేవలు అందిస్తుంది.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కథానిలయం సేకరణ, సహకారాలతో “కథాకోశం” తీసుకు వచ్చింది. అనేకమంది రచయితలు తమ సంపుటాలను ప్రచురించారు.


కథానిలయం స్థాపకులు కాళీపట్నం రామారావు

  • Name: KALIPATNAM RAMARAO

  • Pen-names: Kalipatnam, Kaaraa

  • Date of Birth: 09 Nov 1924

  • Place of Birth: Ponduru, Srikakulam Dt., AP

  • Native Place: Murapaka, Srikakulam Dt., AP

  • Educational: SSLC (IIth Class)

  • Occupation:

    1. High School Teacher till retirement in 1979
    2. Story Writing and other literary Activities

  • Positions held:

    1. Founder Chairman: Kathanilayam Trust, Srikakulam from 1998 till date
    2. Hon. President: Srikakula Sahithi, Srikakulam from 1987 till date
    3. Hon. President: Chaitanya Bharathi, Gajapathi Nagaram 1988 to 1996
    4. Adviser: Rachana, Literary Monthly, Hyderabad from 1991 till date
    5. Trustee: Ravishastri Memorial Literary Trust, Hyderabad 1993 to1999
    6. Member: Visakha Rachayitala Sangham, Visakhapatnam 1950 to 1980
    7. Member: Virasam (Revolutionary Writers Association) 1970 to 1979
    8. Member: Rachakonda Rachana Puraskaram Committee from 1997 till date
    9. Member: Mitra Sahithi, Visakhapatnam from 1998 till date

  • Awards and Honours:

    1. AP Sahitya Akademy Award: For Collection of Stories Yagnam 1973-74 (Rejected)
    2. Telugu University Puraskaram: For “Kalipatnam Ramarao Kathalu” 1987 (Declined)
    3. Gopichand Award: By Yuva Kalavahini, Hyderbad, 1989
    4. AP Films - Nandi Award: For Story of feature film Yagnam 1991
    5. Sahithi Satkaram: Kondepudi Sreenivasarao Literary Award by AP Arasam, Gunturu 1992
    6. Central Sahitya Akademy Award: For Collection of Stories “Yagnam to Tommidi” 1995
    7. Sahithi Harathi Puraskaram: With a purse of Rs. 20000 at Khammam on 8-9-1996
    8. Janapeeth Award: By Literary & cultural Circles with a purse of Rs. One Lakh on 9-11-1996
    9. Visesha Puraskaram: Dr. Ramineni Foundation (U.S.A) 1999
    10. Hamsa Award: By AP State Cultural Council, Govt. of AP for literature 1999
    11. Sahiti Puraskaram: By Prof. Gangappa Literary Committee, Guntur for 1999
    12. Gurajada Award: By Sahridaya Sahithi, Visakhapatnam for 2002
    13. Mahathi Puraskaram: By Mahathi Literary&Cultural Association, Srikakulam 2002
    14. P. Brahmayya Sahithi Puraskaram: Rasadhuni, Palakollu on 31-7-2004
    15. Prathibha Rajivam Award: By AP State Govt. With purse of Rs.50000 on 19-11-2004
    16. Honorary doctorate: By Potti Sriramulu Telugu University on 26-2-2007
    17. Loknayak foundation Award: With a purse of one lakh on 18-1-2008
    18. Ayynki Venkata Ramana Puraskaram: By Dr. Velaga Vekatappayya on 29-07-2009
    19. Kovvali Visishta Sahiti Puraskaram: By Kovvali Family on 30-06-2012
    20. Sripada Subrahmanya Sastri Sahithi Puraskaram: 2012
    21. Gurajada Pratibha Puraskaram: By AP State Govt. with a purse of one lakh on 21-09-2012

  • Published Works:

    1. Ragamayi: A novelette 1957, reprint in 1974
    2. Yagnam: Story collection 1971, 1974, 1975 (3 stories)
    3. Kalipatnam Ramarao Kathalu: Story collection 1972, 1979
    4. Abhimanalu: A novelette 1974
    5. Jeevadhara: Story Collection 1974 (6 Stories)
    6. Kalipatnam Ramarao Kathalu: Story collection 1986 (25 Stories)
    7. Katha Kathanam: Essays on Art of short story writing
    8. Yagnam to Tommidi: Story collection (9 stories) 1993
    9. Kalipatnam Ramarao Rachanalu: Complete works up to 1999
    10. Kalipatnam Ramarao Rachanalu: Complete works up to 2008
    11. Kalipatnam Ramarao Rachanalu: Complete works up to 2013

  • Books on Kalipatnam

    1. Katha yagnam: Collection of essays by various authors 1981
    2. Yagnam pai rendu vyasalu: Critical analysis by Ranganayakamma 1983
    3. Reaserch on socio-economic reflections in Kalipatnam Ramarao stories by Devi Vara Prasad for M.Phil. 1989
    4. Reaserch on Kalipatnam Ramarao stories by KV Santha Kumari for Ph.D. 1998

  • Editorial Service:

    1. July 30 – Essays on Ravi Sastry – 1982.
    2. Manalo Manam – Collection of Essays reflecting the Social, Literary, Cultural and Politico – economic life of Telugu people.
    3. Swetharatrulu – Collection of Telugu short stories – 1993
    4. Ruthupavanalu – Collection of Telugu short stories – 1996
    5. Neti katha - Edited stories for daily publication in Andhra Bhoomi Daily for 3 years 1985-1988 (about 1000 stories)
    6. Neti Katha - Selected Short stories from above project- 1990
    7. Telugu Katha Kosam - Telugu academy publication on Information of short story writers

  • Languages in which Translations appeared:

    English, Russian, Lithuanian, Hindi, Kannada, Tamil, Bengali, Marathi, Malayalam

  • As Publisher:

    1. Sagara Granthamala: Published 10 anthologies of Telugu short stories
    2. R.K. Publications: Published 10 anthologies of Telugu short stories

  • Other Literary Activities: Promotion of Telugu Short story

    1. Addressed and presided many literary meetings on literary issues
    2. Participated in many workshops and guided budding and amateur writers in short story writing.
    3. Founded Kathanilayam in 1997 for preservation of Telugu short story from its appearance in early 1900’s.
    4. Developed it into a research and reference center for short story with its own building and other facilities with the help and cooperation of literary lovers of state, nation and world.

  • Mailing Address:

    Kalipatnam Ramarao,
    Katha nilayam, Suryanagar, Visakha Bank A Colony,
    Srikakulam - 532 001
    Phone: 08942-220069 and 220502
    Mobile: 94405 78506


కథానిలయం ధర్మకర్తల వివరాలు

  1. డా. కాళీపట్నం రామారావు,
    వ్యవస్థాపక అధ్యక్షులు, కథారచయిత,
    కథానిలయం వీధి, విశాఖా ఎ కాలనీ, శ్ర్రీకాకుళం. 532001.
    ఫోన్. 08942-220502, 9440578506.

  2. డా. బి.వి.ఎ. రామారావు నాయుడు, పి హెచ్ డి,
    అధ్యక్షులు, కథారచయిత,
    హరిత, విశాఖా ఎ కాలనీ, శ్ర్రీకాకుళం. 532001.
    ఫోన్. 08942-220478, 9441095961.

  3. ఎన్. రమణ మూర్తి, మెక్.డిప్లమ,
    ఉపాథ్యక్షులు, కథారచయిత,
    1-6-18/5, స్టేడియం మైన్ గేట్, కాలేజ్ రోడ్, శ్ర్రీకాకుళం. 532001.
    ఫోన్. 9440766055.

  4. డి. రామచంద్ర రావు, ఎమ్ ఎ, బి ఇడి,
    కార్యదర్శి, కథారచయిత,
    ప్లాట్ 19-27, కథానిలయం వీధి, విశాఖా ఎ కాలనీ, శ్ర్రీకాకుళం. 532001.
    ఫోన్. 9959885707. E-mail: drchandrarao@gmail.com

  5. కె.వి.ఎస్. ప్రసాద్, ఎమ్ ఎస్ సి,
    సహాయ కార్యదర్శి, కథారచయిత,
    ప్లాట్ 19-7, కథానిలయం వీధి, విశాఖా ఎ కాలనీ, శ్ర్రీకాకుళం. 532001.
    ఫోన్. 9440513637. E-mail: kvsprasad@gmail.com

  6. కాళీపట్నం సుబ్బారావు. బి ఎ, బి ఇ,
    కోశాధికారి, కథారచయిత,
    104, సాయికుటీర్ అపార్టమెంట్స్, కథానిలయం వీధి, విశాఖా ఎ కాలనీ, శ్ర్రీకాకుళం. 532001.
    ఫోన్. 08942-221743, 9490008743. E-mail: kalipatnam48@gmail.com

  7. ఆచార్య కవన శర్మ, పి హెచ్ డి,
    కథా నవలా రచయిత,
    ఇం.నెం. 53. 6 మెయిన్, 5 క్రాస్, టాటానగర్, బంగళూరు, 560092.
    ఫోన్. +91 9448113195, E-mail: sarma.kandula@gmail.com.

  8. వివిన మూర్తి,
    కథా, నవలా రచయిత, విమర్శకులు,
    ఇంచర-27, 6 ఇ మైన్, 15 సి క్రాస్, కార్డ్ రోడ్ వెస్ట్, స్టేజ్ 2, ఫేజ్ 2, బంగళూరు, 560086
    ఫోన్. +91 9449057022, 09603234566, E-mail: vivinamurthy@gmail.com.
    Website: vivinamurthy.wordpress.com

  9. అట్టాడ అప్పలనాయుడు, బి కామ్,
    కథా నవలా రచయిత,
    కోమర్తి జం. నరసన్నపేట వయా, శ్ర్రీకాకుళం జిల్లా .
    ఫోన్. +91 9440031961, E-mail: attada.a@gmail.com.

  10. కీ.శే. యగళ్ల రామకృష్ణ,
    కథారచయిత.

  11. కణుగుల వెంకట రావు, బి కామ్,
    కథారచయిత,
    1-43-39, స్టేడియమ్ ఈస్ట్ గేట్, శ్ర్రీకాకుళం. 532001.
    ఫోన్. 08942-223283, +91 8330949562, E-mail: kavera31@gmail.com.

  12. విశ్వనాధ నాగేశ్వర రావు, బి ఇ,
    కథారచయిత, ఎమ్ డి, విటిసి ఇంజినీరింగ్ ప్ర లి,
    1-44-111, ప్లాట్ హెచ్ ఐ జి 12, సెక్టార్-1, ఎమ్ వి పి కాలని, విశాఖపట్నం, 530017.
    ఫోన్. 0891-2553189, +91 9484198291, E-mail: vicepl@yahoo.co.in.

  13. దాసరి అమరేంద్ర, ఎమ్‌ ఇ,
    కథారచయిత,
    ఎ-301, శివం అపార్ట్ మెంట్స్, ఫ్లేట్ 14, సెక్టార్-12, ద్వారక, న్యూఢిల్లి, 110078.
    ఫోన్. +91 9818982614, E-mail: damarendra@gmail.com.

  14. డా. డి. విజయ్ భాస్కర్, ఎమ్ ఎ, పిహెచ్ డి,
    కథా నాటక రచయిత,
    ఎల్ ఐ జి 127/2RT, ఆంధ్రాబేంక్ వద్ద, విజయనగర్ కాలని, హైదరాబాద్- 500057.
    ఫోన్. 9701385103, E-mail: dvizai@yahoo.com.

  15. సి. ప్రసాద్ వర్మ, బి ఇ,
    కథా రచయిత, విమర్శకులు,
    4-55-4, తొలి అంతస్తు, కృష్ణమందిర్ వద్ద, లాసన్స్ బే కాలని, విశాఖపట్నం, 530017.
    ఫోన్. 9701385103, E-mail: cpvarmavizag@gmail.com


కథానిలయం వార్షికోత్సవాలు

సంవత్సరంతేదీముఖ్య అతిధిముఖ్య ప్రసంగంవివరాలు
1997    
1998    
1999    
2000    
2001    
2002    
2003    
2004    
2005    
2006    
2007    
2008    
2009    
2010    
2011    
2012    
2013    
2014    

కథానిలయం విరాళాలు


ప్రస్తుత స్థితి

...
...
...